Header Banner

ఈ ఎండాకాలంలో మందు బాబులకు కూల్ కూల్ న్యూస్.. భారీగా తగ్గిన బీర్ ధరలు!

  Sat May 17, 2025 12:02        Politics

వేసవి వచ్చిందంటే బీర్ తాగేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతుంది. అందుకే అప్పుడప్పుడూ మీకు ఇష్టమైన బ్రాండ్ మార్కెట్‌లో కనిపించకపోవచ్చు. కానీ ఈసారి అలాంటి నిరాశే లేదు. ఎందుకంటే బ్రిటన్ బీర్ బ్రాండ్లు ఇప్పుడు ఇండియాలో చౌక ధరలకు లభ్యమవుతున్నాయి. భారతదేశం-బ్రిటన్ మధ్య ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) నేపథ్యంలో, బ్రిటన్ బీర్‌పై ఉన్న దిగుమతి పన్ను 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గింది. దీని వల్ల కొన్ని బ్రిటిష్ బీర్ బ్రాండ్లు ఇప్పుడు రూ.200కి బదులుగా రూ.50కే లభించే అవకాశముంది. ఈ ఒప్పందం కేవలం బీర్‌కే కాదు, స్కాచ్ విస్కీ, కార్ల మీద కూడా వర్తిస్తుంది. స్కాచ్ విస్కీపై కూడా పన్ను 150 శాతం నుండి 75 శాతానికి తగ్గింది. ఫలితంగా ఇవి కూడా భారత మార్కెట్లో చౌకగా లభించనున్నాయి. భారతదేశంలో బీర్‌కు మంచి మార్కెట్ ఉంది. 2024 నాటికి దేశీయ బీర్ పరిశ్రమ విలువ రూ.50,000 కోట్లుగా ఉందని అంచనా. ప్రతి సంవత్సరం ఈ మార్కెట్‌ 8 నుంచి 10 శాతం వరకు పెరుగుతోంది. పట్టణాల్లో యువత సంఖ్య పెరగడం, వారి లైఫ్‌స్టైల్‌లో వచ్చిన మార్పులే ఈ వృద్ధికి కారణం. కింగ్‌ఫిషర్: దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బీర్. యునైటెడ్ బ్రూవరీస్ తయారు చేస్తుంది.
బడ్‌వైజర్: అంతర్జాతీయ బ్రాండ్ అయిన ఇది భారత మార్కెట్లోనూ మంచి ఆదరణ పొందింది.

 

ఇది కూడా చదవండి: ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!


హైనెకెన్: ప్రీమియం బీర్ సెగ్మెంట్‌లో డిమాండ్ ఉంది.
కార్ల్స్‌బర్గ్: ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందిన స్ట్రాంగ్ బీర్.
బిరా 91: యువతలో క్రాఫ్ట్ బీర్‌కు క్రేజ్ పెరిగేలా చేసిన ఇండియన్ బ్రాండ్. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీర్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. గోవా అయితే మద్యం చట్టాలు సౌకర్యంగా ఉండటంతో టూరిస్టులకు బీర్ హబ్‌లా మారింది. ఢిల్లీ, చండీగఢ్ వంటి ఉత్తర భారతీయ నగరాల్లో కూడా బీర్ డిమాండ్ ఉంది. ఓకే.. బీర్, విస్కీపై పన్నులు తగ్గాయి. కానీ వైన్‌కి మాత్రం ఎలాంటి రాయితీ లేదు. మే 6న ముగిసిన భారత్-బ్రిటన్ ఒప్పందంలో వైన్ దిగుమతులపై భారత్ ఎలాంటి తగ్గింపూ ఇవ్వలేదు. దీంతో బ్రిటన్ వైన్ ధరలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ ఒప్పందం కింద బీర్, విస్కీతో పాటు, బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే కార్లు కూడా చౌకవుతాయి. అదే విధంగా, భారత్‌ నుండి బ్రిటన్‌కు ఎగుమతి అయ్యే దుస్తులు, తోలు వస్తువులపై బ్రిటన్ పన్నులను తగ్గించనుంది. దీని వల్ల రెండు దేశాల మధ్య వ్యాపారానికి నూతన దిశలో ఊపు వచ్చేందుకు అవకాశముంది. ఇప్పటికి ఈ ఒప్పందంపై చర్చలు ముగిసాయి. అధికారికంగా సంతకం చేయాల్సిన ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, వచ్చే 3 నెలల్లో ఈ ఒప్పందం చట్టబద్ధంగా అమల్లోకి రావొచ్చని అంచనా ఈ ఒప్పందం మూడు సంవత్సరాలుగా సాగిన చర్చల తర్వాత ఫలితాన్ని ఇచ్చింది. ప్రత్యేకత ఏమిటంటే, బ్రిటన్ మార్కెట్లో 99 శాతం భారతీయ వస్తువులపై సున్నా పన్ను విధించనున్నారు. అయితే UK వలస పాలసీలో భారత్‌కు ఎలాంటి ప్రత్యేకత ఇవ్వలేదు. 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని $120 బిలియన్లకు పెంచడం లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. ప్రస్తుతం భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక వ్యాపారం $21.34 బిలియన్లకు చేరుకుంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Beer #money #ViralNews #World